ఉక్రెయిన్ నుంచి వచ్చిన మెడికోలకు గుడ్ న్యూస్. మెడికోలకు కేంద్రం శుభవార్త చెప్పింది. థర్డ్ ఇయర్ మెడికోల పరీక్షలు ఏడాదిపాటు వాయిదా వేసింది. అదే విధంగా ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు మెడికో పరీక్షలు రాయాల్సిన అవసరం లేదని చెప్పింది. నేరుగా అసైన్‌మెంట్ చేసి విద్యార్థులకు డిగ్రీ పట్టా ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో వేలాది మంది విద్యార్థులకు ఊరట లభించనట్లు అయ్యింది. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.