ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ విద్యార్థులకు అలర్ట్... పరీక్ష తేదీల్లో మార్పు!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 08:19 AM

జేఈఈ మెయిన్​-2022 సెషన్ 1,2 పరీక్షల తేదీలు మారాయి. ఈ నెల 21 నుంచి మే 4 వరకు జరగాల్సిన జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్షలను జూన్ 20 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. మే 24 నుంచి 29 వరకు జరగాల్సిన రెండో విడత జేఈఈ మెయిన్ పరీక్షలను జులై 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించింది. అభ్యర్థుల అభ్యర్థన మేరకే షెడ్యూలు మార్చినట్టు జాతీయ పరీక్షల సంస్థ తెలిపింది.


మరోవైపు ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్ పరీక్ష జులై 17న జరగనుంది. జులై 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని ఎన్టీఏ ప్రకటించింది. నేటి నుంచి మే 6 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు సహా 13 భాషల్లో రాత పరీక్ష ఉంటుంది. ఈ ఏడాది నుంచి నీట్ పరీక్షకు గరిష్ఠ వయో పరిమితి ఎత్తివేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa