ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఏపీ కేబినెట్ భేటీ..1

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 09:04 AM

ఏపీ కేబినెట్ చివరి సమావేశం గురువారం మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాలయంలో జరగనుంది. ఈ సమావేశంలోనే మంత్రుల రాజీనామాను సీఎం కోరే అవకాశం ఉందని తెలిసింది. మొత్తం 25 మంది మంత్రుల నుంచి రాజీనామాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఈ నెల 11న కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే కొత్త కేబినెట్ లో 25 మందీ కొత్తవారే ఉంటారా? లేదా ప్రస్తుత మంత్రుల్లో కొంతమంది ఉంటారా అనేది చర్చనీయాంశంగా మారింది.


ప్రస్తుత మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజులలో ముగ్గురు లేదా నలుగురు 11న మళ్లీ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలిసింది. కొత్త మంత్రులు ఎవరన్న విషయాన్ని ఈ నెల 9 లేదా 10 ఉదయం వరకు గోప్యంగానే ఉంచే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa