ప్రేమించిన అమ్మాయి కోసం అబ్బాయిలు కొట్టుకోవడం చూశాం.కానీ తమిళనాడులో ఓ అబ్బాయి కోసం ఇద్దరు కళాశాల అమ్మాయిలు నడిరోడ్డుపైనే నానారచ్చ చేశారు. ఒకరి జుట్టు మరొకరు లాక్కొంటూ.... బాహాబాహీకి దిగారు. వీరిద్దరూ ఓకే అబ్బాయిని ప్రేమించడమే గొడవకు కారణమని తెలుస్తోంది. చెన్నైలోని అన్నానగర్ బస్ స్టాండ్ లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. వారిద్దరు ఘర్షణ పడిన దృశ్యాలను అక్కడున్న విద్యార్థులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో.. అది కాస్తా వైరలైంది. ఘటన విషయం తెలుసుకుని.. సదరు కళాశాల యాజమాన్యం విచారణ చేపట్టింది. ఈ ఇద్దరు యువతులు ఒకే కళాశాలలోని సీనియర్, జూనియర్ అని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa