ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ

national |  Suryaa Desk  | Published : Thu, Apr 07, 2022, 02:09 PM

వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా భర్త, ప్రముఖ దర్శకుడు సెల్వమణిపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. 2016లో సెల్వమణి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అరుళ్ అన్బరసు ఓ టీవీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ.. ఫైనాన్షియర్ ముకుంద్‌చంద్ బోద్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో వీరిద్దరిపై బోద్రా జార్జిటౌన్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. అయితే, ఆ తర్వాత ఆయన మరణించారు. దీంతో ఆయన కుమారుడు గగన్ బోద్రా ఈ కేసును కొనసాగిస్తున్నారు. నిన్న ఈ కేసు విచారణకు వచ్చింది. సెల్వమణి, అరుళ్ అన్బరసులు విచారణకు హాజరు కాలేదు. అంతేకాదు, వారి తరపు న్యాయవాదులు కూడా హాజరు కాలేదు. దీంతో వారిద్దరిపై బెయిలబుల్‌ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa