ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల్లో రష్యా విచక్షణా రహితంగా దాడులు చేస్తోంది. డొనెట్స్క్ ప్రాంతంలోని రైల్వేస్టేషన్‌పై క్రూజ్ క్షిపణితో తాజాగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 30 మందికి పైగా మరణించారు. క్రామాటోర్క్స్ పట్టణంలో రష్యా సేనలు ఉద్దేశపూర్వకంగా రైల్వేస్టేషన్‌పై దాడి చేసినట్లు డొనెట్స్క్ గవర్నర్ పావ్లో కిరిలెంకో చెప్పారు. వందలాది మంది పట్టణం నుంచి వెళ్లిపోయేందుకు రైల్వేస్టేషన్‌కు చేరుకోగా ఆ సమయంలో రష్యా దాడి చేసినట్లు ఆరోపించారు. ఉక్రెయిన్‌లో మారణ హోమానికి పాల్పడుతున్న రష్యాకు వ్యతిరేకంగా పలు దేశాలు చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా జపాన్ తమ దేశంలోని 8 మంది రష్యా రాయబారులను బహిష్కరించనున్నట్లు ప్రకటించింది. అయితే తమ దేశంపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని రష్యా చెబుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa