తమిళనాడు సేలం జిల్లా జారికొండలాంపట్టిలో మారియమ్మన్ కాళియమ్మన్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ఓ భక్తుడు శవం వేషంలో పాడెపై వచ్చాడు. బంధువులు, కుటుంబసభ్యులు అతడికి శవానికి చేసే అన్ని కార్యక్రమాలు చేసి.. అంత్యక్రియలు మాదిరి నిర్వహించారు. తర్వాత అతన్ని ఊరేగింపుగా శ్మశానికి తీసుకెళ్లి.. వెంట తీసుకొచ్చిన కోడిని మాత్రమే పూడ్చారు. అనంతరం అతడు నేరుగా ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నాడు.