భారత కమ్యూనిస్టు పార్టీ(CPM) జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి మరోసారి ఎన్నికయ్యారు. కేరళలోని కన్నూరులో జరుగుతున్న CPM 23వ అఖిల భారత మహాసభలో పార్టీ ప్రముఖులందరూ ఏకగ్రీవంగా ఏచూరిని 3వసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. 1974లో SFI సభ్యుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ప్రకాశ్ కారత్(2010-2015) తర్వాత ఏచూరి 5వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు.