రాష్ట్రంలో ప్రజలపై పన్నులు భారాలు, చార్జీల మోత, విద్యుత్ కోతలు తప్ప ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి పరిపాలన సూన్యమని సీపీఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తిరోగమన విధానాలపై ఈ నెల 11, 12 తేదీలలో సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన విస్తృత ప్రచార ఆందోళనలు, 13న గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ధర్నాలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం మంగళగిరి సిపిఐ పార్టీ కార్యాలయంలో గోడప్రతులని నియోజకవర్గ సిపిఐ నేతలు ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా చిన్ని తిరుపతయ్య మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారన్నారు. పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించడం, వ్యవసాయరంగానికి కరెంట్ సరఫరాను నాలుగు గంటలకు తగ్గించడం, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడం వంటి దుశ్చర్యలకు జగన్ సర్కార్ పాల్పడడం దుర్మార్గమన్నారు.
సోమవారం సాయంత్రం 4: 00 గంటలకి మంగళగిరి సిపిఐ పార్టీ కార్యాలయం వద్ద నుండి మంగళగిరి మార్కండేయ కళ్యాణ మండపం వరకు నిరసన కార్యక్రమం జరగనుందని తెలిపారు. అనంతరం మార్కండేయ కళ్యాణ మండపం లో సిపిఐ పార్టీ జనరల్ బాడీ సమావేశం జరుగుందని తెలిపారు. కావున సిపిఐ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. వాల్ పోస్టర్ ని ఆవిష్కరించిన వారిలో సిపిఐ మంగళగిరి నియోజకవర్గ సహాయ కార్యదర్శి కంచర్ల కాశయ్య, మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు, మాజీ వైస్ చైర్మన్ నందం బ్రహ్మేశ్వరరావు, చిన్ని సత్యనారాయణ, ఉయ్యాల సత్యనారాయణ, హనుమయ్య, కోటేశ్వరరావు, పిడికిడి సాంబశివరావు, జాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.