వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇచ్చినా, ఇవ్వకపోయిన సరే ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే నడుస్తానని తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ వుండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. ఆదివారం నాడు పత్రికాప్రకటన విడుదల చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దళితలకు సీఎం జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని గుర్తు చేసుకున్నారు. సీఎం జగన్ దయవల్లే ఈ రోజు ఎమ్మెల్యేగా కొనసాగుతున్నట్లు గుర్తు చేసుకున్నారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా దళిత సోదరులు, సోదరిమణీలకు సీఎం జగన్ అవకాశం కల్పించినట్లు గుర్తు చేసుకున్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కట్టుబడి ఉండాల్సిందే అన్నారు. రాబోయే కాలంలో కష్టపడిన వారికి సముచిత స్థానం కల్పిస్తారన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు, రాజధాని అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యం అన్నారు. అలాగే నియోజకవర్గంలో కార్యకర్తలే అతి పెద్ద పదవి అని ఎమ్మెల్యే శ్రీదేవి స్పష్టం చేశారు.