భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంటు చార్జీలు వెంటనే తగ్గించాలని కోరుతూ ఈపూరు మండల కేంద్రంలో ఆదివారం రాత్రి ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాలో వారు మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు అదుపు చేయాలని ప్రతి రోజు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేస్తూ వ ఈపూరు మండలంలో వివిధ గ్రామాలలో పర్యటించారు. గ్రామాల్లో విస్తృత ప్రచారం చేస్తూ కరపత్రాలు పంపిణీ చేసి అనంతరం మండల కేంద్రమైన ఈపూరులోని ప్రధాన కూడలిలో గ్రూప్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మారుతి వరప్రసాద్, సహాయ కార్యదర్శులు బూదాల శ్రీనివాసరావు ఉలవల పూడి రాము, ఏఐటీయూసీ నాయకులు కొండ్రముట్ల చిన్న సుభాని, సిపిఐ మండల నాయకులు ఊట్ల రామారావు, సత్యానందం, సూరే అప్పారావు, గోవిందమ్మ, మల్లికార్జున రావు, పరమేష్, శ్రీనివాస్, రాజు తదితరులు పాల్గొని మాట్లాడారు.