గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి రామకృష్ణ థియేటర్ యాజమాన్యం ఆధ్వర్యంలో అనాధ పిల్లల కోసం 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రత్యేక షో ని ప్రదర్శించారు. ఉచితంగా పిల్లలకు సినిమాని చూపించారు. కాగా ఈ ఉచిత షోకు కొంతమంది దాతలు సహాయ సహకారాలు అందించారని థియేటర్ మేనేజర్ విజయ్ కృష్ణ తెలిపారు. 100 మంది అనాథ పిల్లల కోసం ఈ ప్రత్యేక షో నిర్వహించామని థియేటర్ మేనేజర్ విజయ్ కృష్ణ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa