శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా పుల్లలచెరువు మండలం గారపెంటకు చెందిన కొందరు కుంకుమ బండ్లు కట్టి విద్యుత్తు సరఫరా కోసం జనరేటర్లు ఏర్పాటు చేశారు. ఊరేగింపులో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తాటి పెద్దయ్య, బొజ్జ మునయ్య, తాటి ఈదయ్య, ఉడతల బయన్నకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఎర్రగొండపాలెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్సై వేముల సుధాకర్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.