అవనిగడ్డ మండలం వేకనూరు గ్రామంలో కొత్తూరు రామాలయం ఆలయంలో శ్రీరామనవమి పురస్కరించుకుని గ్రామ వాస్తవ్యులు 40 సంవత్సరాల క్రితం వేకనూరు నుండి వెళ్లి హైదరాబాదులో ఉంటున్న తుంగల ముక్కు సోమయ్య కుమారుడు తుంగల మోహన్ రావు - వీర కుమారి దంపతులు కుమారుడు అజయ్ తిరుమల కొత్తూరు రామాలయంలో శ్రీరామనవమి కళ్యాణం చేయించుకోవడం అనంతరం అన్న సమారాధన 2500 భక్తులకి 250000 రూపాయలు అన్నదాతగా నిలిచారు. వారికి కొత్తూరు రామాలయం కమిటీ వారు ఆ దంపతులకి ఘనంగా సన్మానించి సీతారాముల విగ్రహాలు జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో రామ్ ఆలయ కమిటీ సభ్యులు గుడివాక రామకృష్ణ, గుడివాక శ్రీనివాసులు, గుడివాక లోకనాథం, తుంగల ప్రసాద్ రావు, చంటి, సనకా శ్రీనివాసులు పాటు ఆలయ పూజారి సీతారావమ్మతో పాటు మహిళా భక్తులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa