గుంటూరు బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఈనెల 28న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గుంటుపల్లిసాయి వరప్రసాద్ తెలిపారు. ఈ నెల 13న ఓటర్ల జాబితాను ప్రకటిస్తామన్నారు. 21 నుంచి నామ పత్రాలను స్వీకరించి 24న పోటీలో ఉన్న అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటిస్తామని న్నారు. 29 న ఉదయం 10 నుంచి సాయంత్రం 4: 30 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఎన్నికల అధికారి గా బార్ అసోసియేషన్ ప్రస్తుత అధ్యక్షుడు శివ నాగేశ్వరరావు ను నియమించినట్లు ఆయన తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa