కోడూరు మండల పరిధిలోని విశ్వనాధపల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులను ఎంపిపి కొండవీటి వెంకట కుమారి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఉపాధి కల్పించి వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు ఎంపీపీ తెలిపారు. పంట బోదులు, చెరువులు, పంట కుంటలు తవ్వే పనులు ఉపాధి హామీ పథకంలో చేర్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.