తిరువూరు మండలం ఎరుకోపాడు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో గౌరవ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జ్ శావల దేవదత్ మాట్లాడుతూ రహదారి , వాగుపై వారధి అసంపూర్తి, కరెంటు కోతలు, కరెంటు బిల్లులు పెంచి , అభివృద్ధి కార్యక్రమాలు నిలిపివేసి సంక్షేమ పథకాలు అరకొరగా కేటాయిస్తూ పరిపాలన సాగుతుందని మంత్రులను మార్చినంత మాత్రాన అసమర్థ పరిపాలన గాడిలో పడదని మంత్రులను మార్చినట్లు ప్రభుత్వాన్ని కూడా ప్రజలు త్వరలో మారుస్తారు అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సీనియర్ నాయకులు తరిగొప్పుల రంగారావు, చెరుకు వెంకటేశ్వరరావు, కొత్తూరు సత్యనారాయణ, మాజీ సర్పంచ్ కొంగల జనార్ధన్ బండి అశోక్, పెనుమల్లి కృష్ణయ్య, చెరుకు వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు వెదురు వెంకట నర్సిరెడ్డి, పార్లమెంటు తెలుగు యువత అధికార ప్రతినిధి మాదల హరిచరణ్ (కిట్టు) , నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు పిట్టా చైతన్య, మాజీ అధ్యక్షులు కారుమంచి సుబ్బారావు, కొమ్మినేని రాజేష్ ఖన్నా, నల్లమోతు శ్యామ్, కొంగల భీములు, కోట కొండలు, మొదలగువారు పాల్గొన్నారు.