ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ వారి యొక్క ఆదేశాలపై అనగా 12. 04. 2022 వ తేది నాడు నూజివీడు డిఎస్పి బి శ్రీనివాసరావు నూజివీడు సి ఐ ఆర్ అంకబాబు నూజివీడు స్పెషల్ బ్యూరో ఇన్స్పెక్టర్ గోపాలకృష్ణ నూజివీడు టౌన్ ఎస్ఐ రామకృష్ణ నూజివీడు రూరల్ ఎస్సై లక్ష్మణ్ ముసునూరు ఎస్సై రాజారెడ్డి ఆగిరిపల్లి ఎస్ఐ చంటిబాబు మరియు 30 మంది పోలీసు సిబ్బంది తో నూజివీడు రూరల్ పరిధిలో ఉన్న సిద్ధార్థ నగర్ నందు కార్డెన్ సెర్చ్ ను నాటు సారాయి తయారీ మరియు విక్రయాల నివారణ కొరకు నిర్వహించినారు.
మంగళవారం తెల్లవారుజాము నుండి నూజివీడు డిఎస్పీ యొక్క అధ్వర్యంలో పలు ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించి 2002 లీటర్ బెల్లం ఊట స్వాధీనము చేసుకొని బెల్లం ఊట ను ద్వంసము చేసినారు. ఈ తనిఖీల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకొని వారి వద్ద 30 లీటర్ నాటు సారాయి స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేసినట్లు గా నూజివీడు డిఎస్పీ తెలియ చేసినారు.
ఈ సందర్భంగా నూజివీడు డిఎస్పీ మాట్లాడుతూ పచ్చని గ్రామాలలో నాటుసారా తయారీ మరియు విక్రయాల ద్వారా ప్రజల యొక్క ఆరోగ్యాలతో ఆటలాడుకునే వారిపట్ల చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సరైన అవగాహన లేక పల్లెల్లో ఉన్న ప్రజలు సార్ వారి యొక్క విలువైన ప్రాణాలకు హాని చేసుకోవద్దని ప్రతి గ్రామగ్రామాన పోలీసు వారి యొక్క నిఘా ఏర్పాటు చేసినట్లు అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ప్రతి ఒక్కరు వారి యొక్క కుటుంబాల సంరక్షణ కొరకు నాటుసారా నిర్మూలన కొరకు పోలీసు వారు తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని, ఏలూరు జిల్లా ఎస్పీ యొక్క ఆధ్వర్యంలో ప్రజల సౌకర్యార్థం డయల్ 100 ను, 83302959175 మరియు వాట్సాప్ నెంబర్ 9550351100 కు సమాచారాన్ని తెలియజేసిన సమాచారాన్ని తెలియ చేసిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా నూజివీడు డిఎస్పీ తెలియ చేసినారు.