ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మంత్రి పదవి దక్కకపోవడంతో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కీలక వ్యాఖ్యలుచేసారు. ప్రజల నుండి గెలవకుండా నామినేటెడ్ పోస్టులు పొందినవారు నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడ్డారు. నాకు పదవి రాకుండా ఉండటానికి కృష్ణా జిల్లాలో కొన్ని దుష్ట శక్తుల కోటరీగా పని చేశాయి.
ప్రజల్లో నాకు మంచి గుర్తింపు ఉంది. ప్రజల నుండి నేను గెలిచాను. నేనెప్పుడూ గ్రామీణ ప్రాంతంలో తిరుగుతూ ఉంటాను క్యాంప్ ఆఫీసుల చుట్టు కాదు అందుకే దుష్టశక్తుల ఆటలు సాగాయి. ప్రజల నుండి గెలిచిన వ్యక్తులు కాకుండా నామినేటెడ్ పోస్టులు పొందిన వ్యక్తులు నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకున్నారు. నేను ఎదుగుతానని వారు ఓర్వలేకపోతున్నారు. వారెప్పుడూ సీఎం కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఉంటారు. నామినేటెడ్ పోస్టులు పొంది నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుపడ్డారనే అనుమానం నాకు ఉందని అన్నారు.