ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రి వద్ద ఇలా దుమ్ముపట్టి మూలకు చేరిన ఈ వాహనం. ముఖ్యమంత్రి బాల సురక్ష తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్. ప్రభుత్వ ఆసుత్రుల్లో ప్రసవాలు జరిగిన తర్వాత బాలింతలను ఇంటికి చేర్చడానికి వీటిని ఆసుపత్రుల వద్ద ఏర్పాటు చేశారు. ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి గతంలో తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ మంజూరు చేయగా ఏడాది పాటు తిరిగింది. ఇటీవల మరో కొత్త వాహనాన్ని సమకూర్చడంతో ఆ వాహనాన్ని వినియోగించక ఇదిగో ఇలా దుమ్ముపట్టి మూలకు చేరింది.