తూర్పు గోదావరి: అంబాజిపేట మండలం గంగలకుర్రులో రావులమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముగ్గురు అమ్మల మూలపుటమ్మ మా రావుల మ్మ తల్లి కోరిన కోర్కెలను తీర్చే కల్పవల్లి అని ఇక్కడ ప్రజలు కోనియాడతారు. మంగళవారం అమ్మవారి తీర్థ మహోత్సవం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు అందరూ ఈ ఉత్సవాలలో పాల్గొనాలని వారు కోరుతున్నారు. అమ్మవారి ఊరేగింపు మేలతాలతో భాజభజంత్రీలతో బాణా సంచాలతో గారడీ గరగ నృత్యాలతో అంగరంగ వైభవంగా జరుగుతుందని తెలిపారు