పవర్, మనీ రెండు కూడా జగన్ వద్దే ఉన్నాయని, ఏదో ఇవ్వాలని బీసీలకు కొన్ని పదవులు ఇస్తున్నారు అని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు విమర్శలుగుప్పించారు. జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లో మంత్రులకు స్వేచ్ఛలేదని ఆయన అన్నారు. జగన్‌ది ఛాయ్, బిస్కెట్ కేబినెట్ అని సెటైర్స్ వేశారు. జగన్ సలహాదారుల బృందంలో బీసీలకు ఎందుకు చోటు కల్పించలేదని ప్రశ్నించారు. ఈ మంత్రి మండలిలో బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి ప్రాధాన్యం కల్పించలేదన్నారు. ఎలాంటి పెత్తనం, ప్రాధాన్యం పదవులు ఇచ్చి.. అధిక ప్రాధాన్యత కల్పించామని ఎలా చెబుతారని ఆయన నిలదీశారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే బీసీలకు ప్రాతినిధ్యమే కాదు.. ఎంతో ప్రాధాన్యం కల్పించామని యనమల గుర్తుచేశారు. పవర్, మనీ రెండు కూడా జగన్ మోహన్ రెడ్డి వద్దే ఉన్నాయని.. మంత్రి మండలిలో బీసీలు ఉండాలి కాబట్టి.. వారికి ఇస్తున్నారంతే అని అన్నారు. ప్రజల్లో వైఎస్సార్సీపీ పట్ల నెగిటివ్ ఉందని.. అందుకే ఆ పార్టీలో కూడా కొంత మంది తిరగబడేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై యనమల ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం జగన్‌కు సన్నిహితుడైతే.. మంత్రులను డిక్టేట్ చేస్తారా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి డెమొక్రాటిక్ డిక్టెటర్ అని.. జగన్ ఎవరితోనూ చర్చించకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. గతంలో తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తామందరితో చర్చించి నిర్ణయాలు తీసుకునేవారని గుర్తుచేసుకున్నారు.