రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నికైన సర్వేపల్లి శాసనసభ్యులు, వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి కి జిల్లా నలుమూలల నుండి వైఎస్ఆర్సిపి నాయకులు, ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలియజేస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గం నుండి పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు మంత్రి కాకానిని కలిసి పూలమాలలు శాలువాలతో అభినందించి శుభాకాంక్షలు తెలియజేస్తూన్నారు. మంత్రిని కలిసిన వారిలో రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ వైఎస్ఆర్సిపి పంచాయతీ రాజ్ వింగ్ కార్యదర్శి పి. సి. అల్లూరు రాజు, సీతారాంపురం మాజీ జడ్పీటీసీ దుగ్గి రెడ్డి గురువారెడ్డి, ఉదయగిరి మాజీ ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి, వింజమూరు జడ్పిటిసి గణపం బాలకృష్ణ రెడ్డి, నాయకులు విజయ్ కుమార్ రెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.