ఐపీఎల్ మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఐపీఎల్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ కళ్లెం వేసింది. హ్యాట్రిక్ విజయాలతో ఊపుమీదున్న ఆ జట్టుకు టోర్నీలో తొలి ఓటమి రుచిచూపింది. ఎంతో ప్రణాళికబద్ధంగా ఆడిన సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. 163 పరుగుల విజయలక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలుండగానే, కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
తొలుత ఓపెనర్లు అభిషేక్ శర్మ (42), కెప్టెన్ కేన్ విలియమ్సన్ (57) సరైన పునాది వేయగా, చివర్లో నికోలాస్ పూరన్ (18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 34 నాటౌట్) అద్భుతమైన ముగింపునిచ్చాడు. ఈ ఇన్నింగ్స్ లో కేన్ విలియమ్సన్ ఎంతో ఓపికగా ఆడి, అవసరమైనప్పుడు దూకుడు ప్రదర్శిస్తూ ఎక్కడా రన్ రేట్ తగ్గకుండా చూశాడు. విలియమ్సన్ స్కోరులో 2 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. ఈ న్యూజిలాండ్ ఆటగాడికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa