వేమూరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి. ఆర్ అంబేద్కర్ జయంతిని విధిగా చేయాలని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు పిలుపునిచ్చారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 14 వ తేదీన అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వాడవాడలా పండగ వాతావరణం కనిపించేలా అంబేద్కర్ విగ్రహాలు ఉన్న చోట విగ్రహానికి, విగ్రహాలు లేని గ్రామాల్లో ఆయన చిత్రపటాలు ఏర్పాటు చేసి పూలమాలలతో ప్రతి ఒక్కరూ నివాళులర్పించాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa