---మీ బొటన వేలు పొడవు, మీ ముక్కు పొడవు సమానంగా ఉంటాయని మీకు తెలుసా.
---బల్బును కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ 1876లో ఒక ఎలక్ట్రిక్ పెన్నును కనుగొన్నాడట. ఆ పెన్నునే 1891లో మొదటి ట్యాటూ మెషీన్ గా గుర్తించారు.
---బాగా కంపు కొడుతున్న షూలలో డ్రై టీ బ్యాగులను పెడితే బ్యాడ్ స్మెల్ రాదంట.
---తేనెటీగ జీవితకాలం 40 రోజులు. ఆ నలభై రోజుల్లో దాదాపు వెయ్యి పువ్వులపై వాలి కేవలం ఒక టీ స్పూన్ తేనెను మాత్రమే ఉత్పత్తి చేస్తుందట.
---ప్రపంచ జనాభా ఒక్క సారిగా చనిపోవాలంటే ఏం కావాలో తెలుసా... కేవలం 8గ్రాముల బొటాక్స్. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన విషంగా పేరు పొందింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa