తమ పార్టీలో చేరి పనిచేయాలనుకొనే వారికి ఎల్లపుడూ తలుపులు తెరిచేఉంటాయని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభసభ్యులు జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలోకి త్వరలోనే భారీ చేరికలు ఉన్నాయని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన కాసేపటి క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలోకి చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారని ఆయన అన్నారు. అలా తమతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి చూపే వారందరి కోసం బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa