తమ దేశ పౌరుల పట్ల రష్యా సైన్యం దారుణంగా వ్యవహరిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్తోనియా పార్లమెంట్‌లో ప్రసంగించిన ఆయన ‘సుమారు 5 లక్షల మంది ఉక్రేనియన్లను బలవంతంగా రష్యాలోని మారుమూల ప్రాంతాలకు తరలించారు. ఉక్రెయిన్ పిల్లలను రష్యాలోని కుటుంబాలు అక్రమంగా దత్తత తీసుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. తల్లీబిడ్డలను బలవంతంగా వేరు చేస్తున్నారు’ అని జెలెన్‌స్కీ ఆరోపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa