రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథ్యంలో హాఫ్ సెంచరీ నమోదు కావడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. పాండ్యా 52 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 87 పరుగులతో అజేయంగా నిలిచాడు. 53 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన గుజరాత్‌ను హార్దిక్ పాండ్యా ఆదుకున్నాడు. డేవిడ్ మిల్లర్‌తో కలిసి అభినవ్ మనోహర్ మెరుగైన భాగస్వామ్యాలతో స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. అభినవ్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 పరుగులు చేయగా, మిల్లర్ 14 బంతుల్లో 31 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa