ఆంధ్రప్రదేశ్ లో తొలి మొబైల్ సినిమా థియేటర్‌ను రూపొందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని ట్రక్కులో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు.ఈ థియేటర్ ఆచార్య సినిమాతో ప్రారంభంకానుంది.అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ మొబైల్ థియేటర్ ను ఏర్పాటు చేశారు. ఇది అగ్ని ప్రమాదాలను కూడా తట్టుకుంటుంది. దీని సామర్థ్యం 120 సీట్లు మాత్రమే. ఇందులో ఏసీ కూడా ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa