లంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. మెట్‌పల్లిలో రూ.300 కోసం ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశారు. ఈ ఘటన గత నెల 25న శంకర్‌పల్లిలోని వడ్డెర శ్మశానవాటికలో జరగ్గా, పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొని గురువారం రిమాండ్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళితే.. మెట్‌పల్లికి చెందిన సాయిలు(35), మల్లేష్(45) అన్నదమ్ములు. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో పనులు చేస్తున్నారు. శంకర్‌పల్లిలో ఉండే మల్లేష్ వద్దకు గత నెల 25న సాయిలు వచ్చాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఆ సమయంలో నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం, చెరుకుపల్లికి చెందిన చెన్నయ్య(55) ఏదో సమాచారం కోసం వీరితో మాట్లాడాడు. తాగిన మైకంలో ఉన్న మల్లేష్, సాయిలు అతడిని అకారణంగా కొట్టారు. ఆ సమయంలో చెన్నయ్య జేబులో నుంచి రూ.300, ఫోన్ కింద పడ్డాయి. వాటిని సాయిలు, మల్లేష్ చూశారు. చెన్నయ్య వాటిని తీసుకుని కొద్ది దూరం వెళ్లగా అతణ్ని గట్టిగా పట్టుకుని శ్మశానవాటికలోకి తీసుకెళ్లి బండరాయితో కొట్టి చంపారు. రూ.300, ఫోన్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యారు. సీసీటీవీల ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు.