రెండు నెలల క్రితం జైపూర్ లో ఒక యువతి హత్యాచారానికి గురైంది. ఆ కేసును విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని మింటూగా గుర్తించారు. పోలీసుల విచారణలో నిందితుడు గురించి కొన్ని నమ్మలేని విషయాలు బయటపడ్డాయి. అతడు ఇప్పటివరకు 50 మంది యువతులతో ప్రేమాయణం నడిపాడు. జైపూర్ యువతినే కాదు అంతకు ముందు చాలా మంది అమ్మాయిలను చంపేశాడు. మింటూ పేర్లు మార్చుకుని రకరకాల ప్రాంతాల్లో తిరుగుతూ అమ్మాయిలతో పరిచయాలు పెంచుకుంటాడు. వారితో శారీరక సంబంధాలు ఏర్పరచుకుంటాడు. శృంగారానికి అంగీకరించని యువతులపై అత్యాచారం చేస్తాడు. అనంతరం వారిని చంపేసి ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తాడు. నిందితుడు మింటూ సైకో అని, మానసిక వ్యాధిగ్రస్తుడని, సెక్స్ అడిక్ట్ అని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో సైకాలజిస్ట్ సహాయం కూడా తీసుకుంటున్నారు. జైపూర్ యువతి హత్య తర్వాత మింటూ కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. నిందితుడు బివాడీలో పేరు మార్చుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇన్ఫార్మర్ సహాయంతో పోలీసులు నిందితుడి ఆచూకీ తెలుసుకుని అరెస్ట్ చేశారు. ఆల్వార్, గ్వాలియర్, జైపూర్ లలో ఇప్పటికే మింటూపై కేసులు ఉన్నాయి.