ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభుత్వం పై పత్తిపాటి ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 15, 2022, 03:26 PM

ఇవి నవరత్నాలు కావని నవ మోసాలు ఇప్పుడున్న మంత్రులకు అధికారాలు ఉన్నాయా అంటూ వైసీపీ ప్రభుత్వం పై మాజీమంత్రి పత్తిపాటి ఫైరయ్యారు. శుక్రవారం చిలకలూరిపేటలోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో మాజీ మంత్రి పత్తిపాటి మాట్లాడుతూ ఆర్టీసీ చార్జీలు ఘోరంగా పెంచారని పల్లె వెలుగు, సిటీ సర్వీసులు చార్జీలు భారీగా పెంచారన్నారు. డీసెల్ సెస్ పేరుతో ఎడాపెడా జగన్మోహన్ రెడ్డి ప్రజలను బాదుతున్నారని పుల్లారావు అన్నారు.


గత క్యాబినెట్లో ఈ శాఖలో ఎవరున్నారో తెలియ. ఎప్పుడైనా సమీక్షలు పర్యటనలు చేశారా అని ప్రశ్నించారు.టిడిపిలో 110 మంది ఎమ్మెల్యేలకు తొమ్మిది మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చామన్నారు.. ప్రస్తుతం 151 మంది వైసిపి లో ఉన్న కేవలం 11 మంది బీసీలకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారన్నారు.


విద్యాశాఖ మంత్రి లేకుండా సీఎం జగన్ సమీక్ష జరపటం ఏమి అన్నారు. ఇప్పుడు ఉన్న మంత్రులకు అధికారాలు ఉన్నాయా అంటూ మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు ప్రశ్నించారు.కార్పొరేషన్ చైర్మన్ లకు చైర్ కరువైందని పత్తిపాటి సీఎం జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారని ప్రభుత్వాన్ని తరిమితరిమి కొడతారని తెలిపారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలంగా ఉందని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని ఆయన జోస్యం చెప్పారు.


 


ఈ మీడియా సమావేశంలో టిడిపి నాయకులు దాసరి రాజా మాస్టారు, కరిముల్లా, అజారుద్దీన్, నెల్లూరు సదాశివరావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com