మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్లే పోలవరం ప్రాజెక్టులో భాగమైన డయాఫ్రం వాల్ వరదలకు కొట్టుకుపోయిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా తన హయాంలో పోలవరం నిధులు స్వాహా చేసేందుకు చంద్రబాబు కుటిల పన్నాగాలు పన్నినట్లు ఆరోపించారు. స్పిల్ వే కట్టకుండా కాపర్ డ్యాం కట్టి, నిధులు మింగారన్నారు.
దీని కోసమే ప్రాజెక్టులో త్వరగా అయిపోయే పనులు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. పోలవరం కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు అని, దశలవారీగా అది పూర్తవుతుందని తెలిపారు. అక్కడ నిర్వాసితులకు పునారావాసం కల్పించడంపై దృష్టిసారించినట్లు వెల్లడించారు.