కె. కోటపడు మండలంలో చౌడువాడ శివారు గరుగుబిల్లి గ్రామంలో వాలంటరీ చెరువు గర్భంలో నిర్మించిన అక్రమ పశువుల షెడ్డు ను తొలగించాలని ఆ గ్రామానికి చెందిన యువకులు అధికారులను వేడుకుంటున్నారు, రాజకీయ నాయకుల అండతో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేస్తుంటే అధికారులు చర్యలులేవని, అదే గ్రామానికి చెందిన యువకులు ప్రశ్నిస్తున్నారు, గ్రామానికి అనుకొని ఉన్న రాఘవరావు చెరువు జలధార చెరువు కావడంతో, చెరువు నిండితే చేతి బోర్లకు పుష్కలంగా నీరు అందుతుందని, అటువంటి చెరువును కబ్జాదారులు ఆక్రమించే, విషయాన్ని అధికారులకు అనేకసార్లు ఫిర్యాదులు పత్రిక కధనలు వస్తున్న అధికారుల్లో స్పందన లేదు, గ్రామ వాలంటీర్ దర్జాగా గ్రామస్తులు చూస్తుండగా పశువుల షెడ్డును నిర్మించడంతో ఇదే ఆసరాగా మరికొందరు చెరువు, గట్టును, కూడా ఆక్రమించే పనిలో ఉన్నారని దీనిపై జిల్లా కలెక్టరు, రెవెన్యూ డివిజనల్ అధికారి, మండల తహసీల్దార్ స్పందించాలని కోరారు లేనట్లయితే మరికొద్ది రోజుల్లో చెరువు కబ్జా కోరల్లో చిక్కుకు పోతుందని హెచ్చరించారు.