అమ్మవారిని దర్శించుకుని వస్తానని చెప్పి వెళ్లిన యువతి తిరిగి రాకపోవడంపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదయ్యింది. దీనికి సంబంధించి సిఐ రామారావు తెలిపిన వివరాలిలావున్నాయి. చిన్నవాల్తేరు, రెల్లివీధికి చెందిన ఆకుల పైజి(20) ఇంటర్ పూర్తి చేసింది. ఈ నెల 12వ తేదీన పెదవాల్తేరులో జరుగుతున్న పోలమాంబ అమ్మవారి ఉత్సవాలను చూసి అమ్మవారిని దర్శించుకుని వస్తానని చెప్పి ఇంటినుంచి వెళ్లింది. వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో, తెలిసిన అన్ని చోట్ల గాలించారు. యువతీ ఆచూకీ లభించకపోవడంతో ప్రతి తండ్రి ఆకుల సుధాకర్ త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు సీఐ రామారావు ఆధ్వర్యంలో స్టేషన్ రైటర్ అప్పలరాజు దర్యాప్తు చేస్తున్నారు.