ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రియుడితో తల్లి పరార్.. అనాథలైన పిల్లలు

national |  Suryaa Desk  | Published : Sun, Apr 17, 2022, 04:20 PM

భర్త చనిపోయిన తర్వాత పిల్లలను పెంచి పెద్ద చేయాల్సిన ఆ మహిళ బాధ్యతలను విస్మరించింది. తన సుఖం తాను చూసుకుంటూ, ప్రియుడితో పరార్ అయింది. దీంతో ఆరుగురు పిల్లలు దిక్కులేని వారయ్యారు. తండ్రి చనిపోవడం, తల్లి కనిపించకపోవడంతో బేల చూపులు చూస్తున్నారు. ఈ దారుణ ఘటన గురించిన వివరాలిలా ఉన్నాయి.


మహారాష్ట్రలోని విదిశా జిల్లా శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామంలో రాణి అహిర్వార్‌(30)‌కు ఆరుగురు పిల్లలు. ఆమెకు భర్తతో విభేదాలున్నాయి. వారిద్దరికీ గొడవలు అవడంతో ఆమె భర్త కొన్ని రోజుల క్రితం వాటర్ ట్యాంకు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త చనిపోయిన తర్వాత ఎదురింట్లో ఉండే వ్యక్తికి దగ్గరైంది. ఈ క్రమంలో తనకు ప్రియుడే ముఖ్యమని, పిల్లల బాధ్యత అక్కర్లేదని ఆమె భావించింది. ఓ రాత్రి గుట్టుచప్పుడు కాకుండా అతడితో ఎటో వెళ్లి పోయింది. దీంతో ఆమె పిల్లలను బంధువులు అక్కున చేర్చుకున్నారు. ఆమెకు భర్త చనిపోవడంతో రూ.15 లక్షలు ఇన్స్యూరెన్స్ వస్తుందని, ఆ మొత్తాన్ని పిల్లల ఖాతాలో వచ్చేలా చూడాలని అధికారులను వారు కోరుతున్నారు. పిల్లలను వదిలి వెళ్లిందని వారు పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com