చాలా మంది రాత్రి పూట భోజనం చేసిన తర్వాత నడుస్తూ ఉంటారు. తిన్నది జీర్ణం కావడానికే వారు అలా చేస్తుంటారని కొందరు తేలిగ్గా తీసుకుంటుంటారు. అయితే రాత్రి పూట భోజనం చేసిన తర్వాత కొద్ది సేపు నడిస్తే శరీరానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రి పూట భోజనం చేశాక, 20 నుంచి 30 నిమిషాలు నడవాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. వ్యాధులను కట్టడి చేసేలా రోగ నిరోధక శక్తి శరీరానికి చేకూరుతుంది. మధుమేహ బాధితులు రాత్రి పూట వాకింగ్ చేస్తే షుగర్ స్థాయిలను అదుపులో ఉంటాయి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ అందరిలో మెరుగ్గా ఉంటుంది. ఫలితంగా మానసిక ఒత్తిడి దూరమై, శరీరం చురుగ్గా ఉంటుంది.