మెగా టీ20 టోర్నీ ఐపీఎల్-2022లో ఆదివారం ప్రేక్షకులకు డబుల్ బొనాంజా దక్కింది. తొలి మ్యాచ్ కాసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. టాస్ నెగ్గిన హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకు టోర్నీలో ఆడిన ఐదింటిలో వరుసగా మూడు మ్యాచులు నెగ్గి హైదరాబాద్ జోరు మీద ఉంది. మరోవైపు పంజాబ్ జట్టు కూడా ఐదు మ్యాచ్‌లలో మూడు నెగ్గి మరో విజయం సాధించాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది. ఇరు జట్లూ సమఉజ్జీలుగా కనిపిస్తుండడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈ మ్యాచ్‌కు పంజాబ్ రెగ్యులర్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ దూరమయ్యాడు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలను శిఖర్ ధావన్ మోయనున్నాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు: అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి నటరాజన్
పంజాబ్ కింగ్స్ తుది జట్టు: శిఖర్ ధావన్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, ప్రభ్సిమ్రాన్ సింగ్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, ఒడియన్ స్మిత్, కగిసో రబాడ, రాహుల్ చాహర్, వైభవ్ అరోరా, అర్ష్‌దీప్ సింగ్