తిరుపతి జిల్లా చంద్రగిరి మండల పరిధిలోని అనంత గుర్రప్పగారిపల్లి - ఎం. కొత్త పల్లి రెవెన్యూ పరిధిలో నాలుగు రోజులుగా లక్షల విలువైన 3. 5 ఎకరాల ప్రభుత్వ భూమిని జేసీబీతో చదును చేస్తున్నారు. ఏజీపల్లికి చెందిన వైసీపీ నాయకుడు ఆక్రమణకు పాల్పడుతున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తహసీల్దారు శిరీషను వివరణ కోరగా వీఆర్వోలు, వీఆర్ఎలను సంఘటనా స్థలానికి పంపి పనులు నిలిపివేయిస్తామన్నారు.