కుప్పం మండలం కంగుంది గ్రామంలో నాలుగేళ్ల చిన్నారి మిస్సింగ్ అయ్యింది. గ్రామనికి చెందిన మణి అనే వ్యక్తి కూతురు జోషిక శనివారం సాయంత్రం 6 గంటల నుండి కనిపించడం లేదని చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రంతా గ్రామం మొత్తం వెదికినా చిన్నారి ఆచూకి లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్బన్ సిఐ శ్రీధర్ నేతృత్వంలో పోలీసులు చిన్నారి కోసం గ్రామ చుట్టుపక్కల మొత్తం జల్లడపట్టారు. చిన్నారి ఇంటి వద్దకు డాగ్ స్వ్కాడ్ ని సైతం రప్పించి చిన్నారి ఆచూకి కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదే కాకుండా చిన్నారి జోషిక ఆచూకీ కోసం ప్రత్యేక పోలీస్ టీములను ఏర్పాటు చేసి పాప కోసం వెదుకుతున్నారు.