కన్నతల్లి పట్ల ఇద్దరు కుమారులు కర్కశంగా ప్రవర్తించారు. పదేళ్ల పాటు ఆమెను ఓ ఇంట్లో బంధించి, తాళం వేశారు. ఈ అమానుష ఘటన తమిళనాడులోని తంజావూర్ జిల్లా కావేరినగర్‌లో చోటు చేసుకుంది. తల్లి జ్ఞానజోతి (72)ని ఆమె కుమారులు షణ్ముగ సుందరం, వెంకటేశన్ పదేళ్లుగా ఓ ఇంట్లో బంధించి ఉంచారు. షణ్ముగ సుందరన్ దూరదర్శన్‌లోనూ, వెంకటేశన్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గానూ పని చేసి రిటైర్ అయ్యారు. వారి ఉన్నతికి కారణమైన తల్లిని చూసుకోవాల్సిన బాధ్యతను విస్మరించారు. సోదరులిద్దరికీ ఆస్తి తగాదాలు ఉండడంతో పదేళ్లుగా బంధించి ఉంచారు. వారానికి ఓ సారి వచ్చి, కిటికీలో నుంచి బిస్కెట్లు వేసేవారు. చూసే వారెవరూ లేకపోవడంతో వారి తల్లి మానసిక స్థితి కోల్పోయింది. చుట్టుపక్కల వాళ్లు జాలిపడి ఏదైనా పెడితే తింటుంది. ఈ విషయాన్ని గుర్తించి ఓ సామాజిక కార్యకర్త కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కావేరి నగర్‌లోని మహిళ నివాసానికి చేరుకున్నారు. ఆమెను చికిత్స కోసం తంజావూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె దుస్థితికి కారణమైన కుమారులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa