రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ టికెట్ల చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో టీడీపీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. ఆర్టీసీ బస్ ఎక్కి ప్రయాణికులతో మాట్లాడారు. గతానికి ఇప్పటికి ఆర్టీసీ చార్జీలు ఎంత పెరిగాయో గమనించాలని సూచించారు. ప్రధాన కూడలిలో నిరసన తెలిపారు. టీడీపీ మచిలీపట్టణం పార్లమెంటరీ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి పైడిపాముల కృష్ణకుమారి, వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, జిల్లా కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు షేక్ నబి ఘోరీ, , టీడీపీ నాయకులు మోర్ల ప్రసాద్, తెలుగు యువత బందరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మోర్ల శివ, ఇబ్రహీం, జన్ను నాంచారయ్య, తాతా ప్రదీప్, గోవాడ చంటి, పఠాన్ జిలాని పాల్గొన్నారు.