రాష్ట్ర హోం మంత్రిగా తానేటి వనిత బాధ్యతలు చేపట్టారు. ఆపై జైళ్లలో ములాఖత్ వెంటనే జరిగేలా అనుమతిస్తూ మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి వనిత మాట్లాడుతూ.. సీఎం జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా అందరికి న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలుపై దృష్టి పెడతామని చెప్పారు. టెక్నాలజీని ఉపయోగించి సత్వర న్యాయం జరిగేలా చూస్తానని తెలిపారు. దిశ బిల్లును చట్టం చేసేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. కొంతమంది కావాలని అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని హోంమంత్రి వనిత వెల్లడించారు.