వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ మహిళ తన మూడేళ్ల కుమారుడ్ని హత్య చేసింది. ఈ దారుణ ఘటన కేరళ పాలక్కాడ్లోని ఏలప్పుళిలో జరిగింది. మహ్మద్ షామిర్, ఆసియా దంపతుల కుమారుడు మహ్మద్ షాన్ మంగళవారం ఇంట్లో విగతజీవిగా కనిపించాడు. పోలీసులు తల్లి ఆసియాను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది. తన కుమారుడిని తానే చంపినట్లు ఆమె పోలీసుల ముందు అంగీకరించింది.
ఆసియా భర్త షామిర్ కు మాటలు సరిగా రావు. ఆమె ప్రస్తుతం తన భర్తకు దూరంగా ఉంటోంది. ఈ క్రమంలోనే ఆమె మరొకరితో ఎఫైర్ పెట్టుకుంది. ఆసియాకు కుమారుడు ఉన్న విషయం ఆసియా ప్రియుడికి తెలియదు. కొంతకాలానికి అతనికి నిజం తెలియడంతో ఆమెతో మాట్లాడటం మానేశాడు. దీంతో తన ప్రియుడు ఎక్కడ తనకు దూరమవుతాడో అని భావించి ఆసియా తన మూడేళ్ల కొడుకును హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆసియా తొలుత పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. చివరకు తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది.