కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ పర్యటనలో భాగంగా శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన హరిజన గణేష్, ఈశ్వరమ్మ దంపతుల ఏడాది చిన్నారి బలైన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద టీడీపీ యువ నాయకులూ నారా లోకేష్ అక్కడ ధర్నా చేసి , బాధితులకు న్యాయం చెయ్యాలి అని కొంత అలజడికి కారణమైన సందర్భంగా లోకేష్ మీద కేసు నమోదు చేసారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... ఇంత పిరికివాడివేంటి జగన్ ? ప్రశ్నిస్తే కేసు పెడతానంటే ప్రశ్నిస్తూనే ఉంటా. హత్యాయత్నంతో పాటు 11 కేసులు పెట్టావ్. ఇప్పుడు కళ్యాణదుర్గంలో మరో కేసు. నీలా ప్రజల సొమ్ము దొబ్బినందుకు నా పై కేసులు లేవు. ప్రజల పక్షాన నిలబడినందుకు మాత్రమే నా పై కేసులు ఉన్నాయి. మంత్రి పర్యటన సందర్భంగా ఓవర్ యాక్షన్ చేసి దళిత చిన్నారిని బలిగొన్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం చెయ్యమని అడిగిన నాపై కేసు పెట్టారు. బడుగు, బలహీన వర్గాల పక్షాన నిలబడినందుకు 12 కేసులు పెట్టావ్...నెక్స్ట్ ఏంటి? రౌడి షీట్ ఓపెన్ చేస్తావా? దేనికైనా రెడీ అని సవాలు చేసారు.