ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రాన్ని అంధకారం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే: దేవినేని ఉమ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 19, 2022, 11:33 AM

రాష్ట్రాన్ని చీకటి కోరల్లోకి నెట్టి రాష్ట్రాన్ని అంధకారం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి దక్కుతుందని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఎద్దేవా చేశారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పర్యటించిన ఆయన బాదుడే బాదుడు కార్యక్రమం లో పాల్గొన్నారు. కొండపల్లి బొమ్మల కాలనీ ప్రాంతం మౌలిక సదుపాయాల కల్పన నామమాత్రం ఉన్నాయని ఆరోపించారు. వైసీపీ అసమర్థ పాలన కారణం గా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు, అసమర్థ పాలన కారణం గా రాష్ట్రం మరో వందేళ్లు వెనక్కు పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com