ఏఐటియుసి ఆధ్వర్యంలో జరిగే మే డే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోడుమూరు నియోజకవర్గం కార్యదర్శి బి. రాజు తెలిపారు. కోడుమూరు లోని సిపిఐ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేసి కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందని ఐక్యతతో కార్మికులంతా పోరాడాలని తెలిపారు. మే డే ను ఘనంగా నిర్వహించి కార్మికుల ఐక్యతను చాటాలని కోరారు.