రాష్ట్ర నూతన హోంమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తానేటి వనితను మంత్రి కార్యాలయంలో కుప్పం నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. దళితులకు సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారిస్తామని హోంమంత్రి హామి ఇచ్చినట్లు వారు తెలిపారు. మంత్రిని సన్మానించిన వారిలో దేవరాజ్ మాదిగ, రాజుకుమార్ మాదిగ, మురుగేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.