సుమారు రెండు నెలలుగా ఇసుక అందుబాటులో లేదు. దీనితో జగనన్న కాలనిలలో నిర్మాణ పనులు చేపట్టేందుకు ఇసుక కొరతతో లబ్ధిదారులు ఇబ్బందులు పెడటంతో పాటు నిర్మాణ పనులు ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. దీనితో సుమారు 8500 టన్నుల ఇసుక త్రిపురాంతకం మండలంలోని కేశినేనిపల్లి ఇసుక పాయింట్ వద్ద అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆన్ లైన్ ద్వారా ఇసుక బుకింగ్ లేదని బుకింగ్ రాగానే ఇసుక సరఫరా చేస్తామని పాయింట్ ఇంచార్జ్ రామ కోటయ్య తెలిపారు.